స్థిరంగా సింగపూర్ నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడిని ప్రస్తుతానికి మన మార్కెట్లు తట్టుకుంటున్నాయి. రాత్రి కూడా అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. ముఖ్యంగా నాస్డాక్ ఒక శాతంపైగా నష్టపోయి 2 ఏళ్ళ కనిష్ఠ స్థాయికి చేరింది. ఎస్ అండ్ పీ 500 నిఫ్టి 0.75 శాతం నష్టపోయింది. డౌజోన్స్ మాత్రం 0.32 శాతం నష్టంతో సరిపెట్టుకుంది. అయితే చైనాకు చెందిన సెమి కండక్టర్లను నిషేధిస్తూ అమెరికా తీసుకున్న చర్య కారణంగా అనేక మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ముఖ్యంగా తైవాన్ సూచీ మూడు శాతంపైగా నష్టపోయింది. దక్షిణ కొరియా సూచీ కూడా రెండు శాతంపైగా నష్టపోయింది. ఇక జపాన్ నిక్కీ కూడా రెండు శాతంపైగా దెబ్బతింది. ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ సూచీలు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. చైనా స్థిరంగా ఉండగా, హాంగ్‌సెంగ్ 0.97 శాతం నష్టపోయింది. ఆసియా మార్కెట్లన్నీ ఇలా చిక్కుల్లో ఉన్నా మన మార్కెట్లు మాత్రం స్థిరంగా ఉండే అకాశముంది. సింగపూర్ నిఫ్టి 22 పాయింట్ల నష్టంతో ఉంది. సో… నిఫ్టి ఇవాళ స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశముంది.