స్థిరంగా సింగపూర్ నిఫ్టి
ఊహించినట్లే అమెరికా మార్కెట్లు రాత్రి నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చాయి. నాస్డాక్ 0.21 శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.23 శాతం, డౌజోన్స్ 0.06 శాతం చొప్పున నష్టంతో ముగిశాయి. అంతకుముందు యూరో మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. ముఖ్యంగా యూరో స్టాక్స్ 50 సూచీ 0.57 శాతం పెరిగింది. నిరుద్యోగ భృతి కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్య తగ్గడంతో నిన్న డాలర్ మళ్ళీ పెరిగింది. డాలర్ ఇండెక్స్ 107ని దాటింది. రాత్రి క్రూడ్ మళ్ళీ 96 డాలర్లను దాటింది ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.07 శాతం లాభంతో ఉంది. హాంగ్‌సెంగ్ కూడా గ్రీన్‌లో ఉంది. చైనా మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయి. మొత్తానికి ఆసియా మార్కెట్లలో లాభనష్టాలు నామమాత్రంగా ఉన్నాయి. ఇక సింగపూర్ నిఫ్టి ఇపుడు 20 పాయింట్ల నష్టంతో ఉంది. సో.. నిఫ్టి కూడా స్థిరంగా ప్రారంభం కావొచ్చు.