సింగపూర్ నిఫ్టికి భారీ లాభాలు
రాత్రి అమెరికా మార్కెట్లు కోలుకోవడంతో ప్రపంచ మార్కెట్లు కూడా గ్రీన్‌లోకి వస్తున్నాయి. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. దాదాపు అన్ని దేశాల సూచీలు ఒక శాతం నుంచి ఒకటిన్నర శాతం లాభాలతో ఉన్నాయి. అంటే నిన్నటి భారీ నష్టాల నుంచి ఉపశమనం మాత్రమే. ఎందుకంటే అమెరికా ఫ్యూచర్స్ రెడ్‌లో ఉన్నాయి. రాత్రి లాభాల స్వీకరణతో తగ్గిన క్రూడ్ ధరలు మళ్ళీ 2 శాతం పెరిగాయి. జపాన్ నిక్కీ నుంచి చైనా మార్కెట్లు ఒకటిన్నర శాతం వరకు లాభాల్లో ఉన్నా… హాంగ్‌సెంగ్ దాదాపు నష్టాల్లోకి జారుకోవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే మాస్కో మార్కెట్ ఇంకా నష్టాల్లో ఉంది. అమెరికాతో లింక్ ఉన్న అనేక రష్యా కంపెనీలపై ఒత్తిడి తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 250 పాయింట్లకు పైగా లాభంతో ఉంది. సో… నిఫ్టి భారీ లాభాలతో ప్రారంభం కానుంది.