For Money

Business News

నష్టాల్లో సింగపూర్ నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు ఆరంభ లాభాలను కోల్పోయాయి. అన్ని సూచీలు రెడ్‌లోముగిశాయి. నాస్‌డాక్‌ 0.8 శాతం, ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.84 శాతం, డౌజోన్స్‌ 0.69 శాతం నష్టంతో ముగిశాయి. నిన్న రాత్రి యూరో మార్కెట్లు మాత్రం గ్రీన్లో ముగిశాయి. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ ఒక శాతం పైగా నష్టపోగా.. మిగిలిన మార్కెట్‌ అర శాతంపైగా నష్టంతో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ మాత్రం 0.25 శాతం నష్టంతో ట్రేడవుతోంది. రాత్రి అమెరికా డాలర్‌లో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ప్రస్తుతం డాలర్‌ ఇండెక్స్‌ 107.4 ప్రాంతంలో ఉంది. మన మార్కెట్‌లకు ప్రతికూల అంశం క్రూడ్‌ ఆయిల్. రాత్రి క్రూడ్‌ ఆయిల్ ధరలు 6 శాతం దాకా పెరిగాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్‌ 106 డాలర్లపై ఉంటోంది. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి 100 పాయింట్లకుపైగా నష్టంతో ట్రేడవుతోంది. సో… మన మార్కెట్లు కూడా నష్టాల్లో ప్రారంభం కానున్నాయి.