నష్టాల్లో SGX NIFTY
రాత్రి అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా నాస్డాక్ 1.93శాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 1.79 శాతం నష్టపోగా… డౌజోన్స్ కూడా 1.4 శాతం నష్టంతో క్లోజ్ కావడం విశేషం. అంతకుముందు యూరో మార్కెట్లు కూడా నష్టాల్లో ముగిశాయి. రాత్రి డాలర్ మళ్ళీ పెరిగింది. డాలర్ ఇండెక్స్ 105ని దాటడంతో పాటు ఈల్డ్స్ కూడా తగ్గాయి. రాత్రి క్రూడ్ ధరలు భారీగా తగ్గాయి. 87 డాల్ల నుంచి 83 డాలర్లకు తగ్గాయి.ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. చైనా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ సూచీలో మార్పు లేదు. దాదాపు క్రితం ముగింపు వద్ద ట్రేడవుతోంది. జపాన్ నిక్కీ కూడా నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చింది. తైవాన్, ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ సూచీలు నష్టాల్లో ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి 72 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సో … నిఫ్టి నష్టాలతో ప్రారంభం కానుంది.