స్వల్ప నష్టాల్లో SGX NIFTY
గత శుక్రవారం అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగివాయి. ముఖ్యంగా ఐటీ, టెక్ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి రావడంతో నాస్డాక్ 1.87 శాతం నష్టంతో ముగిసింది. ఇక ఎస్ అండ్ పీ 500 సూచీ 0.93 శాతం నష్టపోయింది. ఇక డౌజోన్స్ కూడా 0.43 శాతంతో క్లోజ్ అయింది. ఫెడ్ వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తుందన్న అంచనాతో క్రూడ్ ఆయిల్ భారీగా క్షీణించింది. మరో వైపు డాలర్ కూడా బలహీనంగా ఉంది. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. ప్రధాన మార్కెట్లు ఒక శాతం వరకు నష్టపోయాయి. జపాన్ నిక్కీ 0.89 శాతం, హాంగ్‌సెంగ్ 0.96 శాతం చొప్పున నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇక చైనా మార్కెట్ల నష్టాలు అర శాతం లోపే ఉన్నాయి. మిగిలిన మార్కెట్లలో నష్టాలు నామమాత్రమే. సింగపూర్ నిఫ్టి ప్రస్తుతం 50 పాయింట్ల నష్టంతో ఉంది. సో.. నిఫ్టి నష్టాల్లో ప్రారంభమౌతుందా అన్నది చూడాలి. ఎందుకంటే ప్రధాన కంపెనీల ఆర్థిక ఫలితాల నేపథ్యంతో పాటు క్రూడ్ భారీ క్షీణత నేపథ్యంలో నిఫ్టి నామ మాత్రపు నష్టాలతో ప్రారంభం కావొచ్చు.