For Money

Business News

స్వల్ప లాభాల్లో SGX నిఫ్టి

రాత్రి అమెరికా మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. డౌజోన్స్‌ అత్యధికంగా 1.98 శాతం లాభపడగా, ఎస్‌ అండ్ పీ 500 సూచీ 1.86 శాతం లాభంతో ముగిసింది. ఇక నాస్‌డాక్‌ కూడా 1.59 శాతం లాభంతో క్లోజైంది. నిన్న బాండ్‌ ఈల్డ్స్‌ కూడా తగ్గాయి. డాలర్‌ ఇండెక్స్‌ స్వల్పంగా గ్రీన్‌లో ఉంది. అయితే ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ 0.5 శాతంపైగా నష్టంతో ఉంది. హాంగ్‌సెంగ్‌ కూడా 0.74 శాతం లాభంతో ఉంది. ఇతర సూచీలు నష్టాల్లో ఉన్నా… అర శాతం లోపే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్‌ 42 పాయింట్ల లాభంతో ఉంది. ఈ లెక్కన నిఫ్టి స్థిరంగా ప్రారంభమయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.