లాభాల్లో సింగపూర్ నిఫ్టి
అమెరికా మార్కెట్లు రాత్రి నష్టాల్లో ముగిశాయి. టెక్, ఐటీ షేర్లు నిలదొక్కుకున్నా.. గ్రోత్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వచ్చింది. దీంతో డౌజోన్స్ 1.23 శాతం నష్టంతో క్లోజ్ కాగా, నాస్డాక్ కేవలం 0.16 శాతం నష్టంతో సరిపెట్టుకుంది. ఇక ఎస్ అండ్ పీ 500 సూచీ 0.67 శాతం నష్టంతో ముగిసింది. రాత్రి డాలర్ బలపడింది. డాలర్ ఇండెక్స్ మళ్ళీ 106ని దాటింది. ఒపెక్ మీటింగ్ నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ స్థిరంగా ఉంది. బ్రెంట్ క్రూడ్ 100 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక ఉదయం నుంచి మెజారిటీ ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. ఒక్క ఆస్ట్రేలియా, తైవాన్ మినహా మిగిలిన మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్ నిక్కీ 0.6 శాతం లాభంతో ఉండగా, హాంగ్‌సెంగ్ మాత్రం 0.28 శాతం లాభంతో ట్రేడవుతోంది. సింగపూర్ నిఫ్టి 50 పాయింట్ల లాభంతో ఉంది. సో… నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభం కానుంది.