లాభాల్లో సింగపూర్ నిఫ్టి
అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాల్లో ఉన్నా ఆసియా మార్కెట్లు భిన్నంగా ఉన్నాయి. జపాన్ నిక్కీ స్వల్ప నష్టాలతో ఉండగగా, హాంగ్‌సెంగ్ అర శాతంపైగా నష్టంతో ఉంది. చైనా సూచీలన్నీ నష్టాల్లో ఉన్నాయి. అయితే నష్టాల్లో నామ మాత్రంగా ఉన్నాయి. డాలర్‌తో పాటు ముడి చమురు ధరలు తగ్గడం మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే యూరో మార్కెట్లు కూడా అమెరికా మార్కెట్ల బాటలో నడుస్తుందేమో చూడాలి. ఇక సింగపూర్ నిఫ్టి దాదాపు అర శాతం లాభంతో ట్రేడవుతోంది. సో.. నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభం కానుంది. కొత్త వీల్లీ సెటిల్‌మెంట్ ఇవాళ ప్రారంభం కానుంది. కాని నెలవారీ డెరివేటివ్స్ ఈసారి వచ్చేవారం ముగియనుంది.