లాభాల్లో SGX NIFTY
రాత్రి అమెరికా మార్కెట్లలో చివర్లో మంచి రికవరీ వచ్చింది. సూచీలు చాలా వరకు నష్టాలను తగ్గాయి. మొత్తానికి సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ 500, నాస్డాక్ సూచీలు 0.3 శాతం నష్టంతో క్లోజ్ కాగా డౌజోన్స్ దాదాపు జీరో నష్టాలతో ముగిసింది. డాలర్ స్వల్పంగా పెరిగింది. క్రూడ్ భారీగా క్షీణించింది. ఇక మార్కెట్లు డల్ మూడ్‌లో వస్తున్నాయి. ఎందుకంటే పెద్ద కార్పొరేట్ కంపెనీల ఫలితాలు అయిపోయాయి. ఇక ఆర్థిక సంకేతాలే మార్కెట్‌ను నడపనున్నాయి. ఇక ఆసియా మార్కెట్లు ఇవాళ గ్రీన్‌లో ఉన్నాయి. హాంగ్‌సెంగ్ 1.6 శాతం పెరగ్గా, చైనా మార్కెట్లు స్థిరంగా ఉన్నాయి. ఇతర మార్కెట్లు పాజటివ్‌గా ఉన్న పెద్ద మార్పు లేదు. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 48 పాయింట్ల లాభంలో ట్రేడవుతోంది. సో.. నిఫ్టి పాజిటివ్ జోన్లో ప్రారంభం కానుంది.