For Money

Business News

దేశీయ మార్కెట్‌లోకి మరో ఓటీటీ

డిష్‌ టీవీ సరికొత్తగా వాచో ఓటీటీని ఆవిష్కరించింది. కస్టమర్ల కోసం వాచో మిర్చీ, వాచో మస్తీ, వాచో ధమాల్‌, వాచో మ్యాక్స్‌ పేర్లతో నాలుగు ప్యాకేజీలనూ పరిచయం చేసింది. వీటి నెలసరి సబ్‌స్క్రిప్షన్‌ ధరలు వరుసగా రూ.49, రూ.99, రూ.199, రూ.299గా ఉన్నాయి. ధరనుబట్టి ఈ ప్లాన్లలో డిస్నీప్లస్‌ హాట్‌స్టార్‌, జీ5, సోనీ లీవ్‌ వంటి పాపులర్‌ ఓటీటీలనూ చూడవచ్చు. మరిన్ని ఓటీటీలనూ తమ ప్యాకేజీల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని ఈ సందర్భంగా డిష్‌ టీవీ తెలియజేసింది.