For Money

Business News

లాభాల్లో SGX NIFTY

రాత్రి అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి.ఆరంభంలో నష్టాల నుంచి కోలుకున్నా క్లోజింగ్‌కల్లా నష్టాల్లోకి జారుకున్నాయి. నాస్‌డాక్‌ మళ్ళీ ఒక శాతంపైగా నష్టంతో ముగిసింది. ఇక ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కడా 0.89 శాతం నష్టపోగా, డౌజోన్స్‌ 0.63 శాతం నష్టంతో ముగిశాయి. చైనా కరోనా కేసులు పెరుగుతున్నాయనే వార్తలతో క్రూడ్‌ ధరలు భారీగా తగ్గాయి. ఇపుడ 92 డాలర్ల ప్రాంతంలోకి వచ్చేసింది. డాలర్‌ స్థిరంగా ముగిసింది. బాండ్‌ ఈల్డ్స్‌లో పెద్దగా మార్పు లేదు. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ మాత్రం స్థిరంగా క్రితం ముగింపు వద్దే ఉంది. ఇక షాంఘై సూచీ ఒక శాతం పెరగ్గా, హాంగ్‌ కాంగ్‌ సూచీ 3 శాతం లాభంతో ఉంది. అలాగే తైవాన్‌ సూచీ రెండున్నర శాతం లాభంతో ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో సింగపూర్‌ నిఫ్టి 53 పాయింట్ల లాభంతో ఉంది. సో…నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభం కానుంది.