For Money

Business News

లాభాల్లో సింగపూర్ నిఫ్టి

మన మార్కెట్లు నిన్న సెలవు. అమెరికా మార్కెట్లు మొన్న భారీ లాభాల్లో క్లోజ్‌ కాగా… రాత్రి అదే స్థాయి నష్టాలతో ముగిశాయి. అయితే ఈ ఒత్తిడి అంతా టెక్‌ షేర్లపైనే ఉంది. డౌజోన్స్‌, ఎస్‌ అండ్ పీ సూచీలు దాదాపు రాత్రి స్థిరంగా ముగిశాయి. మైక్రోసాఫ్ట్‌, గూగుల్ ఫలితాలు నిరుత్సాహకరంగా ఉండటంతో నాస్‌డాక్‌ రెండు శాతంపైగా పడింది. బాండ్‌ ఈల్డ్స్ తగ్గాయి. అలాగే డాలర్‌ ఇండెక్స్‌ కూడా 110లోపుకు పడిపోయింది.అయితే క్రూడ్‌ ఆయిల్‌ భారీగా పెరిగింది. బ్రెంట్‌ క్రూడ్‌ ప్రస్తుతం 96 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లన్నీ గ్రీన్‌లో ఉన్నాయి. జపాన్‌ నిక్కీ స్థిరంగా ఉంది. సూచీలో పెద్ద మార్పు లేదు. ఇతర సూచీలు గ్రీన్‌లో ఉన్నా లాభాలు అరశాతంలోపే ఉన్నాయి. హాంగ్‌సెంగ్‌ ఇవాళ మరో 3 శాతం కోలుకుంది. మొన్న ఆరు శాతంపైగా నష్టపోయిన ఈ సూచీ గత రెండు రోజుల్లో కోలుకుంది. ఇక తైవాన్‌ సూచీ కూడా ఒక శాతం లాభంతో ఉంది. సింగపూర్ నిఫ్టి వంద పాయింట్ల లాభంతో ఉంది. అయితే నిన్న ఈ సూచీ రెండు వందల పాయింట్లు పెరిగింది. వీటిని అడ్జస్ట్‌ చేసి నిఫ్టి ఇవాళ ప్రారంభమౌతుంది. ఇవాళ మార్కెట్‌కు వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌.