లాభాల్లో SGX NIFTY
రాత్రి నష్టాల నుంచి అమెరికా మార్కెట్లు తేరుకున్నాయి. ద్రవ్యోల్బణ కట్టడే తమ ప్రధాన లక్ష్యమని ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ పావెల్ అనడంతో నిన్న అమెరికా మార్కెట్లు ఒత్తిడికి లోనయ్యాయి. డాలర్ ఇండెక్స్ మళ్ళీ 110ని తాకడంతో పాటు పదేళ్ళ ట్రెజరీ బాండ్లపై ఈల్డ్ 3.49కి చేరడంతో ఈక్విటీ మార్కెట్లలో ఆందోళనవ్యక్తమైంది. అయితే క్లోజింగ్ కల్లా నష్టాలు పూడ్చుకుని… ప్రధానమ సూచీలన్నీ గ్రీన్‌లో ముగిశాయి. నాస్డాక్, డౌజోన్స్‌తో పాటు ఎస్ అండ్ పీ 500 సూచీలు 0.6 శాతం లాభంతో ముగిశాయి. ముఖ్యంగా నాస్డాక్ 11,660 కి పడిన నాస్డాక్ తరవాత కోలుకుని 11896ని కూడా తాకింది. అంతకుముందు యూరో మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. ఈసీబీ నిన్న 0.75 శాతం చొప్పున వడ్డీ రేట్లను పెంచింది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లు గ్రీన్‌లో ఉన్నాయి. అన్ని సూచీలు గ్రీన్‌లో ఉన్నా… అర శాతంలోపే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న హాంగ్‌సెంగ్ ఇవాళ 1.62 శాతం లాభంతో ఉంది. సింగపూర్ నిఫ్టి 82 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సో… నిఫ్టి గ్రీన్‌లో ప్రారంభం కానుంది.