సింగపూర్ నిఫ్టికి భారీ నష్టాలు
రష్యా, ఉక్రెయిన్ మధ్య టెన్షన్ పెరుగుతోంది. దీని ప్రభావం స్టాక్ మార్కెట్‌తో పాటు ఇతర మార్కెట్లపై తీవ్రంగా పడుతోంది. రష్యా మార్కెట్లు పది శాతం నుంచి 13 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. నాస్‌డాక్ ఒక శాతంపైగా నష్టంతో ముగిసింది. ఇక డౌజోన్స్, ఎస్ అండ్ పీ 500 సూచీలు 0.6 శాతంపైగా నష్టంతో ముగిశాయి. అమెరికా ఫ్యూచర్స్ ఇంకా అర శాతం నష్టంతో ఉన్నాయి. ఇక ఆసియా మార్కెట్ల విషయానికొస్తే అన్ని మార్కెట్లు నష్టాల్లో ఉన్నాయి. అత్యంత కీలక మార్కెట్ జపాన్ నిక్కీ రెండు శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. హాంగ్‌సెంగ్ ఏకంగా 2.75 శాతం నష్టపోయింది. చైనా మార్కెట్లన్నీ ఒక శాతం నష్టంతో ఉన్నాయి. సింగపూర్ నిఫ్టి 200 పాయింట్లకు పైగా నష్టంతో ట్రేడవుతోంది. ట్రెండ్ చూస్తుంటే నిఫ్టి 17000 దిగువకు చేరే అవకాశాలు అధికంగా కన్పిస్తున్నాయి.