For Money

Business News

క్రూడ్‌ ఆయిల్‌ కేక…@ 97$

ఉక్రెయిన్‌, రష్యా మధ్య గొడవలతో డాలర్, క్రూడ్‌ ఆయిల్ పోటీ పడి పెరుగుతున్నాయి. సాధారణ రోజుల్లో డాలర్‌కు అనుగుణంగా ఆయిల్‌ ధరలు మారుతుంటాయి. డాలర్ తగ్గితే ఆయిల్‌ ధర తగ్గడం లేదా పెరిగే ఆయిల్‌ ధర తగ్గడం సహజం. కాని ఉక్రెయిన్‌ యుద్ధం జరిగితే యూరో దేశాలకు రష్యా నుంచి క్రూడ్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడుతుంది. దీంతో భారీగా కొనుగోలు చేస్తున్నాయి యూరో దేశాలు. దీంతో బ్రెంట్‌తోపాటు WTI క్రూడ్‌ ధరలు కూడా 8 ఏళ్ళ గరిష్ఠ స్థాయికి చేరింది. చిత్రం అమెరికా మార్కెట్‌లో క్రయ విక్రయాలు జరిగే WTI క్రూడ్‌ 3 శాతం పైగా పెరిగి 94 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది బ్యారెల్‌ ధర. ఇక ఆసియా దేశాలు కొనుగోలు చేసే బ్రెంట్ క్రూడ్‌ ధర 97.04 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో డాలర్‌ కూడా పెరుగుతోంది. డాలర్‌ ఇండెక్స్‌ ప్రస్తుతం 96.14 వద్ద ట్రేడవుతోంది. దీంతో భారత్ వంటి దేశాలు క్రూడ్‌ కోసం భారీ మొత్తం చెల్లించాల్సి వస్తోంది.