డాలర్ దెబ్బకు ఆసియా విలవిలా
రాత్రి అమెరికా మార్కెట్లు కాస్త ఊపిరి పీల్చుకున్నాయి. వరుస భారీ నష్టాలకు బ్రేక్ పడింది. వాస్తవానికి నాస్డాక్ గ్రీన్‌లో 0.25 శాతం లాభంతో ముగిసింది. డౌజోన్స్ 0.41 శాతం నష్టంతో, ఎస్ అండ్ పీ 0.2 శాతం నష్టంతో ముగిశాయి. డౌజోన్స్ సూచీ కూడా బేర్ మార్కెట్లో ప్రవేశించింది. మిగిలిన రెండు సూచీలు ఇప్పటికే బేర్ ఫేజ్‌లో ఉన్నాయి. రాత్రి ఒక మోస్తరు లాభాలతో ఉన్న డాలర్ ఇవాళ ఉదయం నుంచి మరింత పెరిగింది. డాలర్ ఇండెక్స్ 0.37 శాతం పెరిగి 144.5కి చేరింది. మాంద్యం ఖాయమని వార్తలు వస్తున్న నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు నిలకడగా ఉన్నాయి, బ్రెంట్ క్రూడ్ 84 డాలర్ల ప్రాంతంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆసియా మార్కెట్లు భారీ నష్టాలో ఉన్నాయి. జపాన్ నిక్కీ 1.83 శాతం నష్టపోగా, హాంగ్‌సెంగ్ రెండు శాతం నష్టంతో ట్రేడువుతున్నాయి. తైవాన్ ఒక శాతం నష్టంతో ఉంది. చైనాతో సహా ఇతర మార్కెట్లు 0.5 శాతం నుంచి 0.75 శాతం మధ్య నష్టంతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 150 పాయింట్ల నష్టంతో ఉంది. అంటే నిఫ్టికి అత్యంత కీలకమైన 16900 స్థాయి ఇపుడు డేంజర్ జోన్లో పడినట్లే.