నష్టాల్లో సింగపూర్ నిఫ్టి
శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. జాబ్ డేటా తరవాత ఒక్కసారిగా మార్కెట్ ఈక్వేషన్ష్ మారిపోయి. నాస్డాక్ రెండు శాతంపగా నష్టపోగా.. ఎస్ అండ్ పీ 500 సూచీ 1.29 శాతం తగ్గింది. ఇక డౌజోన్స్ కూడా 0.86 శాతం క్షీణించింది. జాబ్ డేటా తరవాత బాండ్ ఈల్డ్స్ పెరగడంతో డాలర్ పెరగడం చకచకా జరిగిపోయాయి. డాలర్ ఇండెక్స్ 108ని దాటింది. క్రూడ్ ఆయిల్ స్థిరంగా ఉన్నా… డాలర్ పెరగడంతో దిగుమతులు విలువ ఆటోమేటిగ్గా పెరుగుతోంది. ఇక ఉదయం నుంచి ఆసియా మార్కెట్లన్నీ నష్టాల్లో ఉన్నాయి. నిక్కీ 0.6 శాతం క్షీణించగా, హాంగ్‌సెంగ్ నష్టాలు 0.81 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. చైనా మార్కెట్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సింగపూర్ నిఫ్టి 70 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. దీంతో మార్కెట్ నష్టాలతో ప్రారంభం కానుంది.