నష్టాల్లో సింగపూర్ నిఫ్టి
ఈక్విటీ మార్కెట్లలో ఒత్తిడి కొనసాగుతోంది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా ఐటీ, టెక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి అధికంగా ఉంది. నాస్డాక్ 2.47 శాతం క్షీణించగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 1.63 శాతం తగ్గింది.ఒక డౌజోన్స్ ఒక శాతం నష్టంతో క్లోజైంది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ఉన్నాయి. హాంగ్‌సెంగ్ 0.8 శాతం లాభంతో ట్రేడవుతోంది. జపాన్ నిక్కీ స్థిరంగా ఉంది. చైనా అర శాతం నష్టంతో ఉన్నా… మిగిలిన మార్కెట్లు నామ మాత్రపు లాభనష్టాలతో ట్రేడవుతున్నాయి. డాలర్ ఇండెక్స్ 102ని దాటడంతో పాటు క్రూడ్ ధరలు భారీగా పెరగడం ఈక్విటీ మార్కెట్లకు నెగిటివ్‌గా ఉంది. సింగపూర్ నిఫ్టి వంద పాయింట్ల నష్టంతో ఉంది. సో… నిఫ్టి నష్టంతో ప్రారంభం కానుంది.