For Money

Business News

రెస్టారెంట్లలో సర్వీస్‌ చార్జి చట్టవిరుద్ధం

తమ కస్టమర్లపై రెస్టారెంట్లు సర్వీస్‌ చార్జి వసూలు చేయడం పూర్తి చట్ట విరుద్ధమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది. రెస్టారెంట్లు వసూలు చేస్తున్న ఈ చార్జీలకు ఎలాంటి చట్టబద్ధత లేదని పేర్కొంది. కస్టమర్లపై ఈ చార్జి విధించడాన్ని వెంటనే నిలుపుదల చేయాల్సిందిగా నేషనల్‌ రెస్టారెంట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (NRAI)ని కేంద్ర శాఖ స్పష్టం చేసింది.దీనికి సంబంధించి త్వరలోనే చట్టం తెస్తామని పేర్కొంది. ఇలాంటి చార్జీలను రెస్టారెంట్లు వసూలు చేయకుండా చట్టంలో పేర్కొంటామని తెలిపింది. ప్రస్తుత విధానం వల్ల కస్టమర్లు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొంది.