For Money

Business News

58,000 ఎగువన సెన్సెక్స్‌

సింగపూర్ నిఫ్టికి భిన్నంగా మన మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 58,000 స్థాయిని దాటి చరిత్ర సృష్టించింది.నిఫ్టి 17,311 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 77 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. దాదాపు అన్ని సూచీలు గ్రీన్లో ఉన్నాయి. మిడ్‌ క్యాప్‌ సూచీ, బ్యాంక్‌ నిఫ్టి అరశాతంపైగా లాభంతో ట్రేడవుతున్నాయి. ఫిబ్రవరి 25 తరవాత బ్యాంక్‌ నిఫ్టి 37,000 పైన ట్రేడవుతోంది. నిఫ్టి 17350ని క్రాస్‌ చేస్తుందా లేదా… వెనక్కి మళ్ళుతుందా అన్నది చూడాలి.మరోవైపు ఎక్సైడ్‌ లైఫ్‌ని హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ కొనుగోలు చేయడంతో ఆ రంగానికి చెందిన పలు షేర్లు వెలుగులో ఉన్నాయి. అయితే హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ మాత్రం నష్టంలో ఉంది. ఎక్సైడ్‌ లైఫ్‌కు అధిక వాల్యూయేషన్‌ ఇచ్చారని మార్కెట్‌ భావిస్తోంది.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
కొటక్‌ బ్యాంక్‌ 1,808.00 1.78 ఐషర్‌ మోటార్స్‌ 2,777.60 1.62 రిలయన్స్‌ 2,323.00 1.25
గ్రాసిం 1,516.25 1.13
టైటాన్‌ 1,989.25 1.13

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
హెచ్‌డీఎఫ్‌సీ లైఫష్ట్ర్‌ 745.30 -1.81
హెచ్‌సీఎల్‌ టెక్‌ 1,164.70 -0.69
టీసీఎస్‌ 3,820.00 -0.44
నెస్లే ఇండియా 20,160.05 -0.40
టెక్ మహీంద్రా 1,432.30 -0.38