హౌసింగ్ షేర్లపై ఒత్తిడి
వడ్డీ రేట్లు భారీగా పెరుగుతుండటంతో హౌసింగ్ షేర్లపై ఒత్తిడి పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా రియల్ ఎస్టేట్ కంపెనీల షేర్లు కూడా క్షీణిస్తున్నాయి. ఫెడ్ నిర్ణయం తరవాత .. మన ఆర్బీఐ కూడా కనీసం అర శాతం వడ్డీ రేటు పెంచుతుందన్న వార్త మార్కెట్లో వినిపిస్తోంది. ఇవాళ ప్రధాన హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్3.5 శాతం క్షీణంచగా, కెన్ ఫిన్ హౌసింగ్ కంపెనీ షేర్ 4.5 శాతం తగ్గింది. హోమ్ ఫస్ట్ షేర్ కూడా 3.7 శాతం క్షీణించగా, ఇండియా బుల్స్ హౌసింగ్ కంపనీ షేర్ రెండు శాతంపైగా నష్టంతో ట్రేడవుతోంది. నిజానికి ఇవాళ బ్యాంక్, ఎన్బీఎఫ్సీ షేర్లలో భారీ ఒత్తిడి కన్పిస్తోంది.