న్యూఏజ్ షేర్లు మళ్ళీ డీలా
గత ఏడాది నుంచి ఇప్పటి వరకు పబ్లిక్ ఇష్యూకు వచ్చిన న్యూ ఏజ్ షేర్లు గత అక్టోబర్ నెల నుంచి పడుతూ వస్తున్నాయి. చాలా షేర్లు తమ పబ్లిక్ ఇష్యూ ధరకు దిగువకు వచ్చేశాయి. చివరికి మార్కెట్లో సంచలనం రేపిన జొమాటొ, పేటీఎం వంటి షేర్లు ఇపుడు భారీ ఒత్తిడికి లోనవుతున్నాయి. ఇటీవల ఈ కౌంటర్లలో కాస్త కొనుగోలు ఆసక్తి కన్పించింది. ఈ షేర్లన్నీ కొద్దిగా కోలుకున్నాయి. కాని గత వారం రోజుల నుంచి ఈ షేర్లలో మళ్ళీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. ఇవాళ నైకా 6 శాతం నష్టంతో రూ.1500 వద్ద, నౌకరి డాట్ కామ్ రూ.5 శాతం నష్టంతో 3924, జొమాటొ 5 శాతం నష్టంతో రూ.58.10 వద్ద ట్రేడవుతున్నాయి. పేటీఎం షేర్ ఇవాళ మరో 4 శాతం క్షీణించి 546.65కు పడింది. పీబీ ఫిన్ టెక్ 4 శాతం తగ్గి రూ. 604.30 వద్ద ట్రేడవుతోంది.