For Money

Business News

పే పర్‌ వ్యూ: 20 నుంచి జీ ప్లెక్స్‌లో RRR

ఆర్ఆర్ఆర్‌ మూవీ డిజిటల్‌ రంగంలో సంచలనం సృష్టించబోతోంది. ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ వెర్షన్స్‌ హక్కులను జీ5 కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ మూవీని పే పర్‌ వ్యూ(Pay per View) మోడల్‌లో ఈనెల 20వ తేదీ శుక్రవారం నుంచి స్ట్రీమ్‌ చేయనున్నారు. ఈ మోడల్‌ ప్రకారం ఒకసారి చూసేందుకు చార్జి చేస్తారు. ఆన్‌లైన్‌ పేమెంట్‌ తరవాత ఈ మూవీ ఒకసారి చూసేందుకు వీలుంటుంది. డిజిటల్‌ రైట్స్‌ను జీ5 రూ.300 కోట్లకు కొనుగోలు చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ హిందీ, ఇంగ్లిషు, పోర్చుగీస్‌, కొరియా, తుర్కిష్‌, స్పానిష్‌ భాషల్లో స్ట్రీమ్‌ చేసేందుకు డిజిటల్‌ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసింది. జీ5 తన ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీప్లెక్స్‌ రిలీజ్‌ చేస్తుండగా, నెట్‌ఫ్లిక్స్‌ కూడా దాదాపు అదే తేదీకి విడుదల చేసే అవకాశముంది.