For Money

Business News

హిందీ వెర్షన్‌… రూ. 400 కోట్ల క్లబ్‌లో

బాలీవుడ్‌లో చరిత్ర సృష్టిస్తోంది కేజీఎఫ్‌ చాప్టర్‌ 2. యశ్‌ నటించిన ఈ సినిమా ధాటికి డైరెక్టర్‌ హిందీ సినిమాలు కూడా నిలబడలేకపోతున్నాయి. ఇప్పటికి మూడు పెద్ద సినిమాలు కేజీఎఫ్‌ ముందు బోల్తా కొట్టాయి. ఈద్‌ సందర్భంగా ఒక్కసారిగా పెరిగిన కేజీఎఫ్‌ హిందీ వెర్షన్‌ కలెక్షన్‌ రికార్డు స్థాయి వైపు దూసుకువెళుతున్నాయి. ఇవాళ్టి కలెక్షన్స్‌తో కేజీఎఫ్‌ ఛాప్లర్‌ 2 రూ.400 కోట్ల క్లబ్‌లో చేరుతోంది. మూడో వారం శుక్రవారం రూ.4.25 కోట్ల కలెక్షన్‌ సాధించిన కేజీఎఫ్‌ శనివారం రూ.7.25 కోట్లు, ఆదివారం రూ.9.27 కోట్లు వసూలు చేసింది. చిత్రంగా సోమవారం రూ.3.75 కోట్లకు చేరినా.. మళ్ళీ రంజాన్‌ పండుగ రోజున రూ.9.57 కోట్ల కలెక్షన్స్‌తో హిందీలో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది. బుధవారం రూ.8.75 కోట్లు, గురువారం రూ.6.30 కోట్ల కలెక్షన్స్‌తో మొత్తం హిందీ వెర్షన్‌ కలెక్షన్‌ రూ.397.95 కోట్లకు చేరింది. దీంతో ఇవాళ కేజీఎఫ్‌ రూ.400 కోట్ల మార్క్‌ను దాటనుంది. చైనా వంటి పెద్ద మార్కెట్‌లలో ఇంకా కేజీఎఫ్‌ విడుదల కాలేదు.