For Money

Business News

ఆగని టెక్‌, ఐటీ షేర్ల ఉతుకుడు

గత వారం నుంచి నాస్‌డాక్‌లో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ముఖ్యంగా డాలర్‌ పెరగడం, పదేళ్ళ బాండ్‌ ఈల్డ్స్‌ కూడా పుంజుకోవడంతో ఈ కౌంటర్లలో ఎక్కడ లేని ఒత్తిడి వస్తోంది. రోజూ కనీసం ఒకశాతంపైగా నష్టంతో క్లోజ్‌ అవుతోంది నాస్‌డాక్‌ సూచీ. ఇక షేర్ల సంగతి సరేసరి. ఎన్‌విడా, ఎంఎడీ షేర్లు రోజుకు నాలుగైదు శాతం చొప్పున తగ్గుతున్నాయి. టెస్లాకు ఈ నష్టాలు తప్పడం లేదు. ఈ షేర్‌తో పాటు మైక్రోసాఫ్ట్‌, అమెజాన్, యాపిల్‌ సేర్లు ఇవాళ 2 శాతం నుంచి 4 శాతం దాకా పడ్డాయి. నాస్‌డాక్‌ 1.73 శాతం నష్టంతో ట్రేడవుతుండగా, ఎస్‌ అండ్ పీ 500 సూచీ ఒకశాతంపైగా నష్టపోయింది.ఇక డౌజోన్స్‌ 0.49 శాతం నష్టంతో ఉంది. కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌కు ఎదురేలేకుండా పోతోంది. డాలర్‌ ఇండెక్స్‌ వంద దాటింది. డాలర్ దెబ్బతోపాటు చైనాలో కరోనా కారణంగా బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ మూడు శాతంపైగా తగ్గి 98.76 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.