వాల్‌స్ట్రీట్… టెక్ స్టాక్స్ డౌన్
అమెరికా స్టాక్ మార్కెట్లో ఐటీ, టెక్ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. నాస్డాక్ ఇవాళ కూడా 0.85 శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిన్న ఒకటిన్నర శాతం నష్టపోయిన విషయం తెలిసిందే. నిన్నటి మాదిరి ఇవాళ కూడా ఎస్ అండ్ పీ 500 సూచీ క్రితం ముగింపు వద్దే ఉంది. కాని డౌజోన్స్ 0.2 శాతం లాభంతో ఉంది. డిసెంబర్లో ప్రైవేట్ ఉద్యోగులకు సంబంధించి వచ్చిన ఏడీపీ రిపోర్టు చాలా బలంగా ఉంది. మార్కెట్ అంచనాలకు మించి ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వచ్చాయి. ఇవాళే ఫెడరల్ రిజర్వ్ మినిట్స్ కూడా వెలువడనున్నాయి. ఏడీపీ రిపోర్ట్ కారణంగా డాలర్ క్షీణించింది. డాలర్ ఇండెక్స్ మళ్ళీ 96 దిగువకు వచ్చేసింది. ఉద్యోగ అవకాశాల కల్పన ఇలాగే ఉంటే ఉద్దీపన ప్యాకేజీ విషయంలో ఫెడ్ దూకుడుగా వెళుతుందని భావిస్తున్నారు.