For Money

Business News

ఈవీ వ్యాపారంలోకి సోని

జపాన్‌కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ కంపెనీ తాను ఆటోమొబైల్‌ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాలోని లాస్‌వెగాస్ అమెరికాలో జనవరి 5 నుంచి 8 వ తేదీ వరకు సీఈఎస్‌ టెక్నాలజీ ట్రేడ్‌ ఫెయిర్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో సోనీ గ్రూప్‌ చైర్మన్‌-ప్రెసిడెంట్‌ కెనిచిరో యోషిదా న్యూస్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లోకి తాము అడుగుపెడుతున్నట్లు ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం ‘సోనీ మొబిలిటీ ఇన్‌కార్పోరేషన్‌’ పేరుతో కొత్త కంపెనీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.