LEVELS: పెరిగితే అమ్మండి
మార్కెట్ ట్రెండ్ దాదాపు మారిపోయింది. ఇక బై ఆన్ డిప్స్కు గుడ్‌బై చెప్పినట్లే. అలా ఏమైనా చేయాలంటే కేవలం డే ట్రేడింగ్ కోసమే. పొజిషనల్ ట్రేడర్స్ పడినపుడు షేర్లను కొనే పద్ధతికి స్వస్తి పలకవచ్చు. 18500 స్థాయిని నిఫ్టి దాటి ముగిస్తే గాని నిఫ్టిని కొనుగోలు చేయొద్దని పొజిషనల్ ట్రేడర్స్‌కు సలహా ఇస్తున్నారు సీఎన్‌బీసీ ఆవాజ్ మేనేజింగ్ ఎడిటర్ అనూజ్ సింఘాల్. నిఫ్టి 18200ని తాకే అవకాశాలు ఉన్నాయని అన్నారు. నిఫ్టిలో డే ట్రేడింగ్ చేసేవారు కూడా ఇక నుంచి స్ట్రిక్ట్‌గా స్టాప్‌లాస్ అమలు చేయకుంటే భారీగా నష్టపోతారని ఆయన హెచ్చరించారు. ఇవాళ్టి ట్రేడింగ్‌కు ఆయన ఇచ్చిన సలహా ఏమిటంటే… నిఫ్టిలో వెంటనే పొజిషన్ తీసుకోవద్దు. గంట సేపు ఆగి… అమ్మకాలు ఆగే పక్షంలో… ఆ గంటలో నిఫ్టికి ఏదైతే కనిష్ఠస్థాయి ఉందో దాన్ని స్టాప్‌లాస్‌గా ఉంచుకుని నిఫ్టి కొనుగోలు చేయొచ్చని అన్నారు. అలాగే మిడ్ సెషన్లో వచ్చిన లాభాలతో పొజిషన్ నుంచి బయటపడాలని ఆయన సూచించారు. అమెరికా ఫ్యూచర్స్ ఇపుడు గ్రీన్‌లో ఉన్నా… మిడ్ సెషన్‌కల్లా నష్టాల్లోకి రావడం ఖాయమని ఆయన అంచనా వేస్తున్నారు. కాబట్టి పెరిగితే అమ్మడానికి ఛాన్స్ ఉంది కాని… కొనేందుకు ఛాన్స్ లేదన్నారు. 18500 స్థాయిని నిఫ్టి కచ్చితంగా క్లోజ్ అయిన తరవాత కొనుగోలు గురించి పొజిషనల్ ట్రేడర్స్ ఆలోచించాలని ఆయన సూచించారు. ప్రస్తుతానికైతే నిఫ్టిలో అమ్మకాల ఒత్తిడి బాగా వస్తుందని ఆయన అంటున్నారు. 18000 పుట్ రైటింగ్ నిన్న జోరుగా సాగడమే దీనికి కారణమని ఆయన హెచ్చరించారు.