For Money

Business News

NIFTY LEVELS: పెరిగితే అమ్మండి

మార్కెట్‌ చాలా బలహీనంగా ఉంది. అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ పదేళ్ళ గరిష్ఠ స్థాయిలో ఉన్నాయి. డాలర్‌ 20 ఏళ్ళ గరిష్ఠ స్థాయిలో ఉంది. క్రూడ్‌ ఆయిల్‌ ఎనిమిది నెలల కనిష్ఠ స్థాయిలో ఉంది. మాంద్యం భయం వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టి 17470 లేదా 17570 స్థాయిని స్పష్టంగా దాటే వరకు నిఫ్టిని అమ్మడమే బెటర్‌ అని మార్కెట్‌ అనలిస్టులు సలహా ఇస్తున్నారు. నిఫ్టికి తొలి మద్దతు 17221 లేదా 17166 ప్రాంతంలో లభించవచ్చని ప్రముఖ డేటా అనలిస్ట్‌, సీఎన్‌బీసీ టీవీ18 అనలిస్ట్‌ వీరేందర్‌ కుమార్‌ అన్నారు. నిఫ్టికి సంబంధించి ఆయన నాలుగు మద్దతు స్థాయిలను పేర్కొన్నారు. నిఫ్టిని షార్ట్‌ చేసినవారు ఈ స్థాయిలను గమనిస్తూ తమ పొజిషన్స్‌పై నిర్ణయం తీసుకోవాలని అన్నారు.
B1 – 17166
B1 – 17085
B1 – 17004
B1 – 16882
ఈ స్థాయిలను గమనిస్తూ.. పెరిగినపుడల్లా అమ్మడమే బెటర్‌ అని వీరేందర్‌ సలహా ఇస్తున్నారు. మార్కెట్‌లో ఒడుదుడుకులు అధికంగా ఉన్నందున నిఫ్టిలో హెచ్చు తగ్గులు అధికంగా ఉంటాయని ఆయన అన్నారు. 17479 దాటే వరకు నిఫ్టిని కొనుగోలు చేయొద్దని ఆయన సలహా ఇచ్చారు.
(వీరేందర్‌ రివ్యూ వీడియో వెబ్‌సైట్‌ (formoney.in) దిగువ భాగంలో చూడగలరు)