For Money

Business News

ఐటీ షేర్లను ఏం చేయాలి?

తాజా మార్కెట్‌ పతనంలో మరోసారి ఐటీ షేర్లలో ఒత్తిడి వస్తోంది. ఐటీ, టెక్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నాస్‌డాక్‌ గరిష్ఠ స్థాయి నుంచి 30 శాతంపైగా క్షీణించింది. అంటే బేర్‌ ఫేజ్‌లో నడుస్తోందన్నమాట. అయినా అక్కడ ఒత్తిడి తప్పడం లేదు. మన మార్కెట్లలో కూడా ఐటీ షేర్లలో భారీ ఒత్తిడి వచ్చింది రూ. 4500 ధర వద్ద టీసీఎస్‌ బై బ్యాక్‌ చేసింది. ప్రస్తుతం ఆ షేర్‌ రూ. 3000 ప్రాంతంలో ఉంది.అలాగే ఇన్ఫోసిస్‌ 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకింది. ఈ నేపథ్యంలో ప్రముఖ బ్రోకింగ్‌ సంస్థ సిటీ బ్యాంక్‌ ఐటీ రంగంపై తన అంచనాలను విడుదల చేసింది. ఐటీ సెక్టార్‌ మంచి డిఫెన్సివ్‌ సెక్టార్‌ అయినప్పటికీ … 2022-23 ఆర్థిక సంవత్సరంలో కంపెనీల లాభదాయత సాధారణంగా ఉంటుందని, కొన్ని కంపెనీలపై ఒత్తిడి ఉంటుందని పేర్కొంది. నాలుగు ప్రధాన అంశాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టాలని పేర్కొంది. డిమాండ్‌లో మార్పు వస్తున్న తీరు, డెలివరీ మోడల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, క్యాపిటల్‌ అలకేషన్‌తో పాటు ఆయా కంపెనీ అమెరికాయేతర మార్కెట్లలో ఉన్న వ్యాపార అవకాశాలను చూడాలని సూచించింది.ఈ అంశాలను పరిశీలించిన తరవాత ఆ కంపెనీ షేర్‌లో పెట్టుబడి పెట్టాలని పేర్కొంది. హెచ్‌సీఎల్‌, టెక్‌ మహీంద్రా ఫలితాలు, టార్గెట్‌ అంశంలో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. అయితే టీసీఎస్‌, విప్రో, ఎంఫసిస్‌, పర్సిస్టెంట్స్‌ సిస్టమ్స్‌, కోఫోర్జ్‌ షేర్లను అమ్మాల్సిందిగా సలహా ఇచ్చింది.