NIFTY TRADE: దిగువ స్థాయిలో మద్దతు?
ఇవాళ బిగ్‌బాయ్ రిలయన్స్ ఫలితాలు ఉన్నాయి. కొత్త వీక్లీ సెటిల్మెంట్. ఇదే ఈ నెలలో చివరి సెటిల్మెంట్. నిఫ్టి ఓపెనింగ్‌లో స్థిరంగా లేదా స్వల్ప నష్టంతో ట్రేడ్ కావొచ్చ. నిన్న అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో పెరిగిన నిఫ్టిలో ఇవాళ లాభాల స్వీకరణ కన్పించవచ్చు. నిఫ్టి ఇప్పటి వరకు 15,600-15,900 రేంజ్‌లోనే ట్రేడవుతోంది. ఇరువైపులా బ్రేక్ అవలేదు. రిలయన్స్ ఫలితాలతో గరిష్ఠ స్థాయిలో బ్రేక్ అవుతుందేమో చూడాలి. అయితే రిలయన్స్ సేల్స్ 3-4 శాతం పెరగవచ్చని అంచనా. అంతకుమించి ఫలితాలు వస్తే తప్ప…ఈ షేర్ పెరిగే ఛాన్స్ కన్పించడం లేదు. ఇక ఇవాళ్టి టెక్నికల్స్కు వస్తే. ఓపెనింగ్‌లో నిఫ్టి బలం గమనించండి. ఇవాళ్టికి నిఫ్టి రేంజ్ 15,750-15,870. ఏ స్థాయిని తొలుత తాకుతుందో గమనించండి. నిఫ్టిపై ఒత్తిడి వస్తే తొలుత 15,765కి, తరవాత 15,750కి చేరొచ్చు. ఈ స్థాయికి వస్తే 15,730 స్టాప్‌లాస్‌తో కొనుగోలు చేయొచ్చు.15,765పైన ఉన్నంత వరకు నిఫ్టికి ఢోకా లేదు. యూరో మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైతే… నిఫ్టిలో ఒత్తిడి రావొచ్చు. నిఫ్టి ఇవాళ్టి రేంజ్లో గరిష్ఠ స్థాయికి చేరుతుందా అన్నది అనుమానమే. రిస్క్ తీసుకునే ఇన్వెస్టర్లు స్వల్ప స్టాప్‌లాస్‌తో… నిఫ్టి ఏమాత్రం పెరిగినా అమ్మడం బెటర్. ఓ మోస్తరు లాభాలతో బయటపడొచ్చు. దిగువకు చేరినపుడు మరోసారి ప్రయత్నం చేయొచ్చు. అధిక స్థాయిలో కొనుగోలు మాత్రం చేయొద్దు. నిన్నటి మాదిరి భారీ ఓపెనింగ్ తరవాత నిఫ్టి వంద పాయింట్లు పెరగడం అరుదు.