For Money

Business News

ఓపెనింగ్‌లో నిఫ్టికి మద్దతు

సింగపూర్‌ నిఫ్టికి అనుగుణంగా నిఫ్టి స్వల్ప లాభాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి స్వల్ప ఒత్తిడి వచ్చినా… క్షణాల్లో కోలుకుంది. 15.841 స్థాయిని తాకిన తరవాత నిఫ్టి ఇపుడు 15,873 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 50 పాయింట్లు లాభపడింది. నిఫ్టి తన తొలి ప్రధాన నిరోధకం 15,880-15,890కి దగ్గరవుతోంది. రిస్క్‌ తీసుకునే ఇన్వెస్టర్లు 15,900-15,910 స్టాప్‌లాస్‌తో నిఫ్టిని అమ్మొచ్చు. ఏ స్థాయిలో అమ్ముతారనేది ఇన్వెస్టర్ల రిస్క్‌ను బట్టి ఉంది. మిడ్‌సెషన్‌లో లేదా అంతకు ముందు స్వల్ప లాభాలకు ఛాన్స్‌ ఉంది. ఇవాళ మార్కెట్‌లో ప్రధాన షేర్లకు మద్దతు మినహా.. ఒక రంగానికి చెందిన షేర్ల జోరు మాత్రం లేదు. గత కొన్ని రోజులుగా మిడ్‌ క్యాప్ ఐటీ షేర్లు భారీ పెరుగుతున్నాయి.

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
బజాజ్‌ ఆటో 3,923.85 1.83
టాటా స్టీల్‌ 1,291.50 1.45
టైటాన్‌ 1,725.00 1.37
అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 7,559.05 1.34
హెచ్‌సీఎల్‌ టెక్‌ 990.35 1.20

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
టాటా మోటార్స్‌ 300.50 -0.68
యూపీఎల్‌ 824.00 -0.48
నెస్లే ఇండియా 17,910.00 -0.47
సన్‌ ఫార్మా 684.25 -0.44
ఎల్‌ అండ్‌ టీ 1,636.15 -0.37