అరబిందో, ఎస్బీఐ లైఫ్ అమ్మండి
అరబిందో ఫార్మాకు సంబంధించి మరో బ్యాడ్ న్యూస్. హైదరాబాద్ శివార్లలోని ఈ కంపెనీలో అమెరికా ఎఫ్‌డీఐ టీమ్ పరిశీలన చేసి పది అంశాలకు సంబంధించి అభ్యంతరాలను తెలిపినట్లు కంపెనీ తెలిపింది. దీంతో ఈ షేర్‌పై ఒత్తిడి పెరుగుతోంది. స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రాజేస్ సత్పుతే ఈ షేర్‌ను అమ్మాల్సిందిగా సిఫారసు చేశారు. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్లో ఆయన మాట్లాడుతూ రూ. 480 స్టాప్‌లాస్‌తో అరబిందో ఫార్మాను అమ్మాలని.. రూ. 240లను ఈ షేర్ తాకొచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ షేర్ రూ. 4 నష్టంతో రూ. 465 వద్ద ట్రేడవుతోంది. ఇక ఎస్బీఐ లైఫ్ ఫ్యూచర్స్‌ను కూడా అమ్మాల్సిందిగా రాజేష్ సలహా ఇచ్చారు. ఈ షేర్ ప్రస్తుతం రూ. 22.80 నష్టంతో రూ. 1224 వద్ద ట్రేడవుతోంది. రూ. 1240 స్టాప్‌లాస్‌తో రూ. 1210 లేదా రూ. 1190 టార్గెట్‌తో అమ్మొచ్చని ఆయన సలహా ఇచ్చారు.