For Money

Business News

18200 చేరువలో నిఫ్టి

ఓపెనింగ్‌లోనే నిఫ్టి ఇవాళ తొలి మద్దతు స్థాయిని తాకింది. 18227 స్థాయిని తాకిన నిఫ్టి ఇపుడు 18229 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 78 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. నిఫ్టి తదుపరి మద్దతు స్థాయి 18185 లేద ఆ18190. డే ట్రేడర్స్‌కు ఇవాళ్టికి కీలక స్థాయి 18150. ఇక ఇతర సూచీల విషయానికొస్తే ప్రధాన సూచీలన్నీ నష్టాల్లో ఉన్నాయి. అయితే నష్టాలు నామమాత్రంగానే ఉన్నాయి. నిఫ్టిలో 37 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. స్టీల్‌ ఎగుమతులపై సుంకాలు ఎత్తివేయడంతో ఆ రంగానికి చెందిన కంపెనీల షేర్లు నిఫ్టి టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. సెన్సెక్స్‌ నుంచి డాక్టర్‌ రెడ్డీస్‌ స్థానంలో టాటా మోటార్స్‌ను చేరుస్తున్నారు. దీంతో డాక్టర్‌ రెడ్డీస్‌ 2 శాతం నష్టంతో నిఫ్టి టాప్‌ లూజర్‌గా నిలిచింది. ఊహించినట్లే జొమాటో షేర్‌ ఇవాళ రెండు శాతం తగ్గింది. అలాగే నైకాలో కూడా పతనం కొనసాగుతోంది. ఈ షేర్‌ రెండున్నర శాతం నష్టపోయింది. బ్యాంక్‌ నిఫ్టి యాక్సిస్‌ బ్యాంక్‌ మినహా… మిగిలిన షేర్లు నష్టాల్లో ఉన్నాయి. మిడ్‌ క్యాప్‌ బ్యాంక్‌ షేర్లలో పీఎన్‌బీ ఇంకా లాభాల్లో కొనసాగుతోంది. ఈ స్థాయిలో కూడా ఈ షేర్‌ను కొనుగోలు చేయొచ్చని రూ. 50 టార్గెట్‌ ఉండొచ్చని స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ చందన్‌ తపారియా వెల్లడించారు.