For Money

Business News

ఎలాన్‌ మస్క్‌పై SEC కేసు

టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌పై అమెరికా స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ అయిన సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజీ కమిషన్‌ -SEC దావా వేసింది. ట్విటర్‌ కంపెనీని టేకవర్‌ చేసే సమయంలో స్టాక్‌ మార్కెట్‌ నిబంధనలను ఎలాన్‌ మస్క్‌ పాటించలేదని SEC ఆరోపించింది. ట్విటర్‌ వాటాలను క్రమంగా కొనుగోలు చేసే సమయంలో … సదరు కొనుగోళ్ళ సంగతిని ఎప్పటికపుడు స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు మస్క్‌ వెల్లడించలేదంటూ ఆయనపై దావా వేసింది. కంపెనీలో 5 శాతం మించి వాటా కొనుగోలు చేస్తే… సదరు సమాచారాన్ని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపాల్సి ఉంది. కాని ఆ విషయాన్ని మస్క్‌ దాచి పెట్టారని SEC ఆరోపిస్తోంది. దీంతో వాటాదారుల నుంచి తక్కువ ధరకే మస్క్‌ ట్విటర్‌ షేర్‌ను కొనుగోలు చేశారని పేర్కొంది. మస్క్‌ కొనుగోళ్ళ గురించి తెలియకపోవడంతో సాధారణ ఇన్వెస్టర్ల తమ వద్ద ఉన్న షేర్లను అమ్ముకుని నష్టపోయారని SEC ఆరోపించింది. దీనివల్ల సాధారణ ఇన్వెస్టర్లకు 15 కోట్ల డాలర్ల మేర నష్టం జరిగిందని SEC పేర్కొంది. 2022లో నాలుగు వేల 400 కోట్ల డాలర్లకు ట్విటర్‌ను ఎలాన్‌ మస్క్‌ కొనుగోలు చేశారు. ఇదే సమయంలో ట్విటర్‌ కొనుగోలు కోసం టెస్లా షేర్లను అమ్మారన్న ఆరోపణలు కూడా ఎలాన్‌ మస్క్‌పై ఉన్నాయి. దీనిపై కూడా SEC దర్యాప్తు చేస్తోంది.
ఈనెల 20న డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడు అమెరికా అధ్యక్షుడిగా పదవీ ప్రమాణం చేయనున్నారు. ట్రంప్‌ కేబినెట్‌లో టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌కు తాజా కేసు తలనొప్పిగా మారింది.