జేఎం ఫైనాన్స్‌కు సెబీ వార్నింగ్

జేఎం ఫైనాన్షియల్స్ కంపెనీకి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుంచి వార్నింగ్ లెటర్ వచ్చింది. పబ్లిక్ ఇష్యూల సమయంలో నిబంధనలను ఈ సంస్థ పాటించడం లేదని హెచ్చరించింది. ఈనెల 2న సెబీ నుంచి తమకు లేఖ అందినమాట నిజమేనని జేఎం ఫైనాన్షియల్ ధృవీకరించింది. ఇటీవల పబ్లిక్ ఇష్యూకు వచ్చిన వెస్టర్న్ క్యారియర్ (ఇండియా) లిమిటెడ్ పబ్లిక్ ఆఫర్ విషయంలో కంపెనీ నిబంధనలను పాటించలేదని సెబీ తన వార్నింగ్ లెటర్‌లో పేర్కొంది.