F&O: 93 శాతం మందికి నష్టాలు
ఏ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినా..తొలి కన్పించే వార్నింగ్ ఇదే. పైగా అట్ ద రేట్ కాకుండా… కాస్త దూరంగా ఉన్న కాల్ లేదా పుట్ కొనాలని ప్రయత్నిస్తే… ఆ కాంట్రాక్ట్‌లో నష్టపోయే ఛాన్స్ ఎంత ఉందో కూడా చెబుతోంది ట్రేడింగ్ అకౌంట్. ఇప్పటి వరకు సెబీ హెచ్చరిక ప్రకారం 95 శాతం మంది ఇన్వెస్టర్లు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో నష్టపోతున్నారు. తాజా అధ్యయనంలో వీరి శాతం పెద్దగా తగ్గలేదని… ఇంకా 93 శాతం మంది ఇన్వెస్టర్లు నష్టపోతున్నారని సెబీ హెచ్చరింది. ఈ మేరకు తాను నిర్వహించిన సర్వే ఫలితాలను సెబి విడుదల చేసింది. ఈ సర్వే ప్రనకారం ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలోనే F &Oలో 91 శాతం మంది ఇన్వెస్టర్లు నష్టపోయినట్లు సెబీ పేర్కొంది. దాదాపు 73 లక్షల మంది ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్లు నష్ట పోయినట్లు సెబీ వెల్లడించింది. వీరు గత మూడు ఏళ్ళలో సగటున రూ.1.2 లక్షలు చొప్పున నష్టపోయినట్లు సెబీ స్పష్టం చేసింది. 2022FY నుంచి 2024FY మధ్య కాలంలో వీరు ఈ మొత్తం నష్టపోయినట్లు వెల్లడించింది. ఒక్క 2023-24 FYలో రూ.75 వేల కోట్ల మేర నష్టపోయినట్లు పేర్కొంది. F&Oలో లవాదేవీల చార్జీలు పోగా లక్ష వరకు లాభాలు పొందిన ఇన్వెస్టర్ల సంఖ్య కేవలం 7.2 శాతమేనని సెబి పేర్కొంది. ఈ విభాగంలో ట్రేడింగ్ పెరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సెబీ పేర్కొంది.