For Money

Business News

బాబా రామ్‌దేవ్‌కు సెబి షాక్‌

బాబా రామ్‌దేవ్‌కు చెందిన రుచి సోయా ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ఇవాళ ముగిసిన విషయం తెలిసిందే. రూ. 615-రూ.630ల ధరకు ఈ షేర్లను ఆఫర్‌ చేశారు. ఈ ఇష్యూకు రీటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఇతర విభాగాలకు ఆదరణ దక్కడంతో ఇష్యూ సబ్‌స్క్రయిబ్‌ అయింది. అయితే ఇష్యూ నడుస్తున్న సమయంలో ఎస్‌ఎంఎస్‌ అడ్వర్టమెంట్లు కావాలని సర్కులేట్‌ చేశారని సెబి అనేక ఫిర్యాదులు వచ్చాయి. వాటి పరిశీలించిన సెబి సంచలన నిర్ణయం తీసుకుంది. ఇష్యూకు సబ్‌స్క్రయిబ్‌ చేసినవారిలో ఎవరికైనా ఇష్టం లేకపోతే తమ దరఖాస్తును ఉపసంహరించుకునే అవకాశాన్ని కల్పించింది. అలాంటి వారు ఈనెల 30లోగా తమ దరఖాస్తులను ఉపసంహరించుకోవాల్సి ఉంటుంది.