జీకు సెబీ షాక్… ఖేల్ ఖతం

జీ గ్రూప్ ప్రమోటర్లకు మరో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. జీ ఎంటర్టైన్మెంట్ గ్రూప్ కంపెనీల లావాదేవీలలో జరిగిన అవకతవకలపై దర్యాప్తును మరింత లోతుగా చేపట్టాలని సెక్యూరిటీ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఆదేశించింది. గ్రూప్ కంపెనీలకు చట్ట విరుద్ధంగా నిధులు తరలించారంటూ వచ్చిన ఆరోపణలను విచారించిన సెబీ ఇది వరకే సెబీ ప్రమోటర్లు సుభాష్ చంద్రతో పాటు ఆయన కుమారుడు పునీత్ గోయెంకాపై ఆంక్షలు విధించింది. గ్రూప్‌లోని నాలుగు కంపెనీల్లో ఎలాంటి హోదాలో కొనసాగవద్దని పేర్కొంది. 2023లో ఇచ్చిన ఈ ఆదేశాల్లో సెబీ నిబంధనలకు విరుద్ధంగా నిధులు బదిలీ చేశారని ఆరోపించింది. అయితే సెబీ అప్పిటేట్ అథారిటీ నుంచి ఉపశమనం పొందిన జీ గ్రూప్ ప్రమోటర్లు సెబీకి సెటిల్మెంట్ దరఖాస్తు చేశారు. అయితే ఈ దరఖాస్తును తిరస్కరిస్తూ ఇవాళ సెబీ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తాను జారీ చేసిన షోకాజ్ నోటీసును కూడా రద్దు చేసింది. ఈ మొత్తం వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తును తాజా దర్యాప్తులో భాగంగా చూడాలని పేర్కొంది. ఎస్సెల్ గ్రూప్ ఛైర్మన్‌గా సుమారు రూ. 4210 కోట్లను నిబంధనలను విరుద్ధంగా బదిలీ చేశారని సెబీ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణల కారణంగానే జీ గ్రూప్‌తో కుదిరిన ఒప్పందం నుంచి సోనీ టీవీ వైదొలగించింది.