బ్రైట్‌కామ్‌పై ఫోరెన్సిక్ ఆడిట్

ఇటీవలి కాలంలో వివిధ రకాల డీల్స్ వార్తల్లో ఉంటున్న హైదరాబాద్ డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ బ్రైట్‌కామ్ గ్రూప్ లిమిటెడ్ ఇపుడు మరో వార్తతో సంచలనం రేపుతోంది. ఈ కంపెనీ ఖాతాలపై అనుమానం రావడంతో ఫోరెన్సిక్ ఆడిటింగ్‌కు సెబీ ఆదేశించింది. కంపెనీ అకౌంట్స్ తనిఖీ బాధ్యతను ప్రముఖ ఆడిటింగ్ సంస్థ డెలాయిట్‌కు అప్పగించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరానికి అంటే అయిదేళ్ళ ఖాతాలను డెలాయిట్ ఆడిట్ చేయనుంది. గత ఏడాది సెప్టెంబరు 16వ తేదీనే సెబీ తమకు సమాచారం అందించిందని స్టాక్ ఎక్స్ఛేంజీలకు బ్రైట్‌కామ్ నిన్న వెల్లడించింది. కంపెనీకి చెందిన 2019-20లో కంపెనీ ఖాతాల్లో వ్యత్యాసాలు ఉన్నాయని సెబి గుర్తించింది. ఈ వ్యత్యాసాలు ఇన్వెస్టర్లతో పాటు సెక్యూరిటీ మార్కెట్ల ప్రయోజనాలకు నష్టదాయకం కావచ్చని సెబీ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.