For Money

Business News

సోషల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీలు వస్తున్నాయి

వివిధ సామాజిక అంశాలపై దృష్టి సారించిన సంస్థల కోసం సోషల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎస్‌ఎస్‌ఈ)కి సెబీ ఇవాళ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా ఖరారు చేసింది. వీటిపై ఇది వరకే ఏర్పాటు చేసిన వర్కింగ్‌ గ్రూప్‌ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా వీటిని రూపొందించారు. ఈ సామాజిక సంస్థలు లాభపేక్ష ఉన్న సంస్థలు కావొచ్చు లేదా లాభాపేక్ష లేని సంస్థలు కూడా ఉండొచ్చు. ఇవి నిధుల సమీకరణ కోసం స్టాక్‌ ఎక్స్ఛేంజీలో లిస్ట్‌ అవుతాయి. సెబి నిర్దేశించిన 15 రంగాలకు చెందిన సంస్థలనే నిధుల సమీకరణకు అనుమతిస్తారు. ఎస్‌ఎస్‌ఈ గురించి తాము ప్రాథమిక నిర్ణయం తీసుకుని, మార్గదర్శకాలు జారీ చేశామని.. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమేనని సెబి చైర్మన్‌ అజయ్‌ త్యాగి అన్నారు.