For Money

Business News

మరో బిగ్‌ పబ్లిక్‌ ఆఫర్‌ వస్తోంది!

ప్రస్తుతం మార్కెట్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ అందిస్తున్న ఏకైక కంపెనీ సీఎస్‌డీఎల్‌. ఇవే సర్వీసులు అందిస్తున్న ఎన్‌ఎస్‌డీఎల్‌ త్వరలో ప్రైమరీ మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. ఒక కంపెనీలో ఒక సంస్థకు 15 శాతం మించి వాటారాదనే నిబంధనల 2018లో కేంద్రం తెచ్చింది. ఈ నిబంధనను 5 ఏళ్ళలో పూర్తి చేయాలని ప్రతిపాదించింది. ఎన్‌ఎస్‌డీఎల్‌లో పలు కంపెనీలకు 15 శాతం మించి వాటా ఉంది. దీంతో ఈ గడువు ముగిసిన 2023లోనే ఐపీఓకు ఎన్‌ఎస్‌డీఎల్‌ సెబీ వద్ద ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. దాదాపు ఏడాది తరవాత ఇపుడు సెబీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్‌ఎస్‌డీఎల్‌లో ఎన్‌ఎస్‌ఈ, ఐడీబీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎస్‌బీఐతో పాటు కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంది. ఇందులో ఎన్‌ఎస్‌ఈకి 24 శాతం, ఐడీబీఐకి 26 శాతం వాటా ఉంది. దీంతో ఈ కంపెనీలు తమ వద్ద ఉన్న 15 శాతానికి మించిన వాటాను ఈ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా విక్రయించనున్నారు.

Leave a Reply