ఫండ్ బిజినెస్‌లోకి బజాజ్ ఫిన్‌సర్వ్
మ్యూచువల్ ఫండ్ వ్యాపారంలో ప్రవేశించేందుకు బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీకి స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. దీంతో తనే నేరుగా లేదా అనుబంధ సంస్థ ద్వారా మ్యూచువల్ ఫండ్ బిజినెస్ కోసం అసెట్‌మేనేజ్‌మెంట్ కంపెనీని నెలకొల్పుతున్నట్లు బజాజ్ ఫిన్ సర్వ్ వెల్లడించింది. అలాగే ట్రస్టీ కంపెనీని కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొంది. సెబి అనుమతి రావడంతో కంపెనీ షేర్ 8 శాతంపైగా లాభపడి రూ.16,549 వద్ద ట్రేడవుతోంది. అనుబంధ కంపెనీ అయిన బజాజ్ ఫైనాన్స్ కూడా 4 శాతం పెరిగి రూ.7,023 వద్ద ట్రేడవుతోంది. గడచిన మూడు నెలల్లో బజాజ్ ఫిన్ సర్వ్ ఏకంగా 45 శాతంపైగా పెరిగింది.