క్రెడిట్‌కార్డుతో అద్దె చెల్లిస్తే… వాయింపే
పేటీఎం వచ్చిన తరవాత క్రెడిట్ కార్డుపై అద్దెను అతి నామమాత్రపు ఫీజుతో చెల్లించే ఆప్షన్ తెచ్చింది. ఈ ఆప్షన్‌కు ఆదరణ పెరగడంతో తాము ఆదాయం కోల్పోతున్నామని బ్యాంకులు భావించాయి. దీంతో ఇలా అద్దె చెల్లించేవారిపై చార్జీలు వేయడం ప్రారంభించాయి. ఇపుడు ఎస్బీఐ కూడా అదే బాట పట్టింది. క్రెడిట్ కార్డుతో ఇంటి అద్దె చెల్లించినప్పుడు ఆ మొత్తంపై రూ.99 సర్వీస్ ఛార్జీ విధించబోతున్నట్లు ఎస్బీఐ కార్డ్స్ ప్రకటించింది. నవంబరు 15 నుంచి ఇది అమల్లోకి వస్తున్నట్లు తెలిపింది.ఈ చార్జీపై మరో 18 శాతం జీఎస్టీ అదనంగా ఉంటుంది. మరోవైపు ఈఎంఐ లావాదేవీలపై ప్రస్తుతం ఉన్న ప్రాసెసింగ్ ఫీజును రూ.100 మేర పెంచేసింది. ఇప్పటి దాకా ఈ ఫీజు రూ.99 ఉండగా, నవంబర్ 15 నుంచి రూ.199 చేసింది. దీనిపై మళ్ళీ జీఎస్టీ ఉంటుంది.