డిపాజిట్లపై వడ్డీ భారీగా పెంపు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) టర్మ్ డిపాజిట్లపై వడ్డీని భారీగా పెంచింది. కాలపరిమితిని బట్టి వడ్డీ రేట్లను అర శాతం నుంచి ఒక శాతం వరకు పెంచింది. 211 రోజుల టర్మ్ డిపాజిట్ నుంచి 10 ఏళ్ళ రీటైల్ టర్మ్ డిపాజిట్ పై వడ్డీ రేట్లను 0.15 శాతం నుంచి 0.65 శాతం వరకు పెంచింది. రుణాలపై వడ్డీ రేట్లను పెంచతున్న బ్యాంకులు మరోవైపు నిధుల కొరతను ఎదుర్కొంటున్నాయి. దీంతో డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా పెంచుతున్నాయి. గతంలో కేవలం 0.10 శాతం లేదా 0.2 శాతం మేర వడ్డీ పెంచుతున్న బ్యాంకులు ఇపుడు ఏకంగా అర శాతం పైగా పెంచతున్నాయి. దీన్ని బట్టి మార్కెట్లో నిధుల ప్రవాహం తగ్గిపోతోంది. దీంతో డిపాజిట్లపై అలాగే రుణాలపై బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్నాయి.