For Money

Business News

జీఎంఆర్ ఇన్‌ఫ్రా కొనండి… భాసిన్‌

ఐఐఎఫ్‌ఎల్‌కు చెందిన ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ సంజీవ్‌ భాసిన్‌ కొద్దిసేపటి క్రితం నాలుగు షేర్లు సిఫారసు చేశారు. మెటల్స్‌ ధరలు ప్రపంచమంతా పెరుగుతున్నాయని, జపాన్‌ కంపెనీలు కూడా స్టీల్‌ ధరలు పెంచాయని.. కాబట్టి టాటా స్టీల్ కొనుగోలు చేయాలని ఆయన సిఫారసు చేశారు. ప్రస్తుతం రూ. 1044 వద్ద ఉందని… ఈ షేర్‌లో రూ. 50 డివిడెండ్‌ ఉందని, ఎక్స్‌ డివిడెండ్‌ రూ.1100 వద్ద ఈ షేర్‌ ధర పలుకుతుందని అన్నారు. అలాగే సెయిల్‌ షేర్‌ ధర రూ. 74.45 వద్ద ఉంది… రూ. 72 స్టాప్‌లాస్‌తో ఈ షేర్‌ కొనాలని, టార్గెట్ రూ.82 అని పేర్కొన్నారు. ఇక మూడో షేర్‌ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా. ఈ షేర్‌ ధర రూ. 36.50వద్ద ఉందని.. రూ. 34.50 స్టాప్‌లాస్‌తో రూ. 38.50 టార్గెట్‌ కోసం కొనొచ్చని పేర్కొన్నారు. ఇక నాలుగో షేర్‌ ఆర్తి ఇండస్ట్రీస్‌. ఆర్తి ఇండస్ట్రీస్‌లో 740 జూన్‌ కాల్‌ను కొనుగోలు చేయాలని ఆయన సిఫారు చేశారు. ప్రస్తుతం ఈ కాల్‌ను రూ. 12 వద్ద కొనుగోలు చేయాలని… స్టాప్‌లాస్‌ రూ.7 కాగా టార్గెట్‌ రూ. 25గా భాసిన్‌ పేర్కొన్నారు.