For Money

Business News

దిగువస్థాయిలో అందిన మద్దతు

దిగువ స్థాయి నుంచి నిఫ్టి 200 పాయింట్లు పుంజుకుంది. వరుసగా నాలుగు రోజల నష్టాలకు ఇవాళ తెరపడింది. నిఫ్టి బ్యాంక్‌ ఏకంగా 400 పాయింట్లు పెరిగింది. ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ ముగింపు కారణంగా చివర్లో వచ్చిన షార్ట్‌ కవరింగ్‌తో నిఫ్టి 16492ని తాకింది. తరవాత 16478 పాయింట్ల వద్ద 122 పాయింట్ల లాభంతోముగిసింది. బ్యాంక్‌ నిఫ్టి కూడా ఏకంగా 139 పాయింట్ల లాభంతో 35000పైన ముగిసింది. సెన్సెక్స్‌ 427 పాయింట్లు లాభపడింది. అన్ని సూచీలు లాభాల్లో ముగిశాయి. ఇవాళ మార్కెట్‌కు డాక్టర్‌ రెడ్డీస్‌, బీపీసీఎల్‌, రిలయన్స్‌, ఐషర్‌ మోటార్స్‌, బజాజ్‌ ఆటో అండగా నిలిచాయి. ఇక నిఫ్టిలో టాప్‌ లూజర్‌ టాటా స్టీల్‌ నిలబడింది. శ్రీసిమెంట్‌, గ్రాసిం, టాటా మోటార్స్‌, ఎన్‌టీపీసీ నష్టాల్లో ముందున్నాయి. బయోకాన్‌ ఇవాళ నిఫ్టి నెక్ట్స్‌లో స్టార్‌ షేర్‌. ఈ షేర్‌ ఇవాళ అయిదు శాతం లాభపడింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా టాప్‌ నిఫ్టి బ్యాంక్‌ గెయినర్‌గా నిలిచింది. ఎల్‌ఐసీ షేర్‌ ఇవాళ ఏకంగా రూ. 16.35 పడి రూ. 721.70 వద్ద ముగిసింది.