సాగర్ సిమెంట్స్‌కు నష్ఠాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో ప్రధాన సిమెంట్ కంపెనీలన్నీ నష్టాలు ప్రకటిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన సాగర్ సిమెంట్స్ కూడా ఈ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.489 కోట్ల ఆదాయంపై రూ.రూ.49 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం ఆదాయం కంపెనీ రూ.371 కోట్ల టర్నోవర్… రూ.20 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఈ ఏడాది టర్నోవర్ 32 శాతం పెరిగినా… లాభాల నుంచి నష్టాల్లోకి జారుకుంది. రెండో త్రైమాసికంలో నిర్వహణా వ్యయాలు 52 శాతం పెరగడం నష్టానికి ప్రధాన కారణమని సాగర్ సిమెంట్స్ పేర్కొంది.