For Money

Business News

ఓయో, మేక్‌మైట్రిప్‌లపై రూ.392 కోట్ల ఫైన్‌

అనుచిత వ్యాపార పద్ధతులు అనుసరిస్తున్నాయంటూ ఆన్‌లైన్‌ ట్రావెల్‌ సర్వీస్‌ కంపెనీలు మేక్‌మైట్రిప్‌, గోఇబిబో, ఓయో సంస్థలపై కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) భారీ జరిమానా విధించింది. హోటల్స్‌, రెస్టారెంట్లతో ఈ సంస్థల ఒప్పందాలు పోటీని దెబ్బతీసేలా గుత్తాధిపత్యాన్ని చెలాయిస్తున్నాయని.. అందుకు వీటిపై రూ.392 కోట్ల జరిమానా విధించినట్లు స్పష్టం చేసింది. తమ ప్లాట్‌ఫామ్‌ ద్వారా బుక్‌ చేసుకున్న ధర కంటే, తక్కువ ధరకు సదరు సంస్థలు ఇతరులకు రూమ్‌లు కేటాయించకూడదన్న నిబంధనను తప్పుపట్టింది. వెంటనే ఈ సంస్థలు హోటల్స్‌, రెస్టారెంట్లతో తమ ఒప్పందాలను తమ తాజా ఆదేశాలకు మార్చుకోవాలని స్పష్టం చేసింది. ఇందులో మేక్‌మైట్రిప్‌, గోఇబిబో ఒకే గ్రూప్‌ కంపెనీలు కాగా ఓయో మాత్రం వేరే సంస్థ. మొత్తం రూ.392 కోట్ల జరిమానాలో రూ.223.48 కోట్లు మేక్‌మైట్రిప్‌, గోఇబిబోలు… రూ.168.88 కోట్లు ఓయో చెల్లించాలని ఆదేశించింది. డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌పై సీసీఐ ఈ స్థాయిలో జరిమానా విధించడం ఇదే మొదటిసారి.